హీరోయిన్ అంజలి రెమ్యునరేషన్ ఇంతగా తగ్గిందా?

నేటి తరం హీరోయిన్లలో అన్ లక్కీ అంటే అంజలీ అనే చెప్పొచ్చంటారు సినీ జనాలు. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి మల్టీ స్టారర్ లో నటించినా, ఎందుకో ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు రాలేదు. 'గీతాంజలి' వంటి చిన్న చిత్రం పెద్ద విజయాన్ని సాధించినా అదే స్థితి. దీంతో కోలీవుడ్ ను అంజలి ఆశ్రయించగా, అక్కడా దురదృష్టమే వరించింది.

దీంతో ఏం చేయాలో పాలుపోని ఆమె, తన రెమ్యునరేషన్ ను భారీగా తగ్గించుకుందట. ఇటీవల తెలుగులో ఓ సినిమాను కేవలం రూ. 60 లక్షలకు చేయడానికి ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది. కొత్తగా వచ్చిన హీరోయిన్లే ఒక్కో సినిమాకు రూ. 50 లక్షలకు పైగా తీసుకుంటున్న ఈ రోజుల్లో ప్రముఖ హీరోయిన్ అయిన అంజలి పరిస్థితి ఇలా మారిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 
Go Back to Shorts
Anjali
Heroine
Remunaration
Fans

More Telugu News